telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికలను నిర్వహించండి: ఈసీకి సీఎస్ సాహ్నీ లేఖ

sahani neelam cs

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ ఈసీకి లేఖ రాశారు. స్థానిక ఎన్నికలను కొనసాగించాలని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. కరోనా పేరు చెప్పి, ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె కోరారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా, ఓట్ల ముద్రణ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని పేర్కొన్న ఆమె, ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదని, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు.

ఇక స్థానిక ఎన్నికల నిర్వహణ పై నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ భేటీ కానున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్, గవర్నర్ ను కలిసి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే గవర్నర్, ఎస్ఈసీల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts