కులమతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటై నీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే రోజు ఆగస్టు 15. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెల్ల దొరలతో పోరాడిన త్యాగ శీలులను, గొప్ప మహానుభావులను స్మరించుకునే పర్వదినం. అలాంటి ఈ రోజున మనం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దేశభక్తి రగిలించే సందేశాలు పోస్ట్ చేశారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నందమూరి బాలకృష్ణ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ… స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు” అని ఆయన తెలిపారు.
previous post