telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “నానోడిగల్ 2” ట్రైలర్

Naadodigal

2009లో తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం ‘నానోడిగల్’… ‘శంభో శివ శంభో’ పేరుతో సముద్రఖని దర్శకత్వంలో తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే. “నానోడిగల్”లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కగా… మరో ప్రముఖ నటుడు, దర్శకుడు శశికుమార్ నటించడం విశేషం. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. శశికుమార్, అంజలి, అతుల్య, భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. శనివారం ‘నానోడిగల్ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. స్టూడెంట్స్, పాలిటిక్స్ వంటి అంశాలతో తెరకెక్కిన ‘నానోడిగల్ 2’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. జ్ఞాన సంబంధం, తులసి, నమో నారాయణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఎన్.కె.ఏకాంబరం.

Related posts