ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ భారీ ర్యాలీ భారీ జనసందోహంతో ముందుకు కదులుతోంది. ఈ సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇసుక ఇంత కొంప ముంచుతుందని వైసీపీ నేతలు కూడా ఊహించి ఉండరని అన్నారు. ప్రభుత్వం నిలదొక్కుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావించాడని, కానీ, వైసీపీ వాళ్లే పోరాటానికి ఓ అవకాశం ఇచ్చారని అన్నారు.
ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే వాళ్ల దుంప తెగే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు 32 లక్షల మందే అన్నారని, కానీ కోటి మందికి పైగా ఉన్న విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇసుక అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు భవన నిర్మాణ కార్మికులకు కొంత మొత్తం పరిహారంగా చెల్లించాలని కోరారు. మత్స్యకారులకు వేట నిషేధం సమయంలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందనన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా అదే విధంగా పది వేలో, పదిహేను వేలో చెల్లించాలని నాగబాబు డిమాండ్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్