తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఒక్కో వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
నాబార్డు రాష్ట్ర ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతోందని, భూగర్భ జలవనరులు పెరిగాయన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలని, ఐకేపీల ద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ పంపుసెట్లను క్రమంగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లుగా మార్చడంపై దృష్టి సారించాలని, గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు.