*కాంగ్రెస్ కు షాక్ ..ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా..
*కాసేపట్లో మీడియా సమావేశంలో ప్రకటన
*మునుగోడు వేదికగా కేసీఆర్‌పై పోరాటం
తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమైన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను మరికాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
ఇందుకోసమే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఆయనపై వేటు వేయాలని ఆ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్.
దీంతో కాంగ్రెస్ పార్టీ తనపై వేటు వేయడానికి ముందు తానే కాంగ్రెస్ పార్టీ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలనే యోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని.. ఇందుకోసమే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.
మునుగోడు వేదిక నుంచే కేసీఆర్‌పై పోరాటం ప్రారంభిస్తానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం అయ్యారు.