telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దర్శకుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్…

తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టీజర్‌‌ వివాదం రేపుతోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఆదివాసీల వీరుడు, మన్యం పులి ముద్దుబిడ్డ కొమురం భీమ్ వీరత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉండడంతో ఈ సినిమాపై అబిమానుల అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. ఈ విషయం పై ఎంపీ సోయం బాపు రావు మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉంది అని వార్నింగ్ ఇచ్చారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోము, నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారు, భీంను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదు అని ఎంపీ బాపురావు తెలిపారు.

Related posts