తెలంగాణలో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాల అంశంపై లోక్ సభలో ప్రస్తావిస్తానని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణాలపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త నిర్మాణాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న భవనాలు చాలాకాలం వినియోగించుకోవచ్చని సూచించారు. తెలంగాణలో ప్రస్తుత అసెంబ్లీ భవనం పార్లమెంట్ కన్నా బాగుంటుందన్నారు. విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు అనడం ఆశ్చర్యకరంగా ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించా : పవన్ కళ్యాణ్