ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీ తేజను కొందరు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా కారులోకి ఎక్కారు.. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు.
అనంతరం డ్రైవింగ్ సీట్లో ఉన్న పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించి దాడి చేశారు. బలవంతంగా రూ. 75 వేలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని పరారయ్యారు.
కాగా ఈ ఘటనపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో నామా కొడుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు ప్రారంభించారు. పృథ్వీతేజ ఏ మార్గంలో ప్రయాణం చేశాడో ఆ మార్గంలోని సీసీటీవీల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మార్గంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా లేక పృథ్వీని ఎవరైనా వాహనంలో ఫాలో అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు



అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి