telugu navyamedia
తెలంగాణ వార్తలు

అధిష్టానం కీల‌క నిర్ణ‌యం : రాజ‌గోపాల్‌రెడ్డి బుజ్జ‌గింపులు బాధ్యత వీరిదే

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ని వీడి రాజగోపాల్ బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా చూసే బాధ్యతను సీనియర్ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అప్ప‌గించింది పార్టీ నాయకత్వం.

రెండు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారన్ని తేల్చాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన మేరకు రెండు రోజుల్లో ఈ వ్యవహరంపై తేల్చే అవకాశం ఉంది

గ‌తంలో ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు ఇచ్చారు. కోమటిరెడ్డిది రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ పోన్ కూడా చేశారు. ఢిల్లీ రావాలని సూచించారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడితే ఆ తర్వాతి పరిణామాలపై కూడా ఆలోచించాలని సూచించినట్లు సమాచారం.అంతేకాకుండా త్వరలో మనుగుడులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేేసే యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీని వీడాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

పార్టీ మార్పు చారిత్రక అవసరమని కూడా ఆయన గత మాసంలో ప్రకటించారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా చర్చలు ప్రారంభించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ చర్చించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా చర్చించారు.

 

Related posts