తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ళు, కరోనా, హైద్రాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయ్యింది. ఇప్పటివరకు డబల్ బెడ్రూం ఇళ్లు రాని వారే ఎక్కువ ఉంటారు.. దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు అసహనమే ఉదాహరణ. ఎందుకంటే దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నాడు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదు. అందువల్ల దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో స్పష్టత లేదు అని చెప్పారు. CMRFకు విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారు. విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని అడిగనందునే .. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు అని పేర్కొన్నారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో విపత్తు నిధులొస్తాయి అని అన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

