telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి మున్సిపల్‌ ఎలక్షన్స్‌. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఏపీలోని అన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేరు లేదని.. స్టీల్‌ ప్లాంట్‌లో 100 శాతం రాష్ట్రానికి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నామని.. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుందని విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్‌ సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై జగన్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అవసరమైనప్పుడు కేంద్రానికి మద్దతు ఇవ్వాలని కోరామని నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

Related posts