తెలంగాణలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చ్సెస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్‌లు కట్టాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమురం భీం(ఆసిఫాబాద్) జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును రైతలు నిలదీశారు.
సోమవారం యూరియా పరిస్థితిని పరిశీలించేందుకు కలెక్టర్ కాగజ్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంలో రైతులు తమకు యూరియా అందే వరకు కదలనివ్వమని కలెక్టర్ వాహనం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గత వారం రోజులుగా యూరియా అందటం లేదని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా నిత్యం పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. యూరియా నిల్వలు పెంచాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.
ఏపీ ప్రజలను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది: చంద్రబాబు