telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: పవన్ కల్యాణ్

pawan

ఏపీలో అకాల వర్షాలతో రైతుల పంటలు దెబ్బతిన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధిక పెట్టుబడితో పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలిందన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న, ఉద్యాన వన పంటల రైతులకు కన్నీరే మిగిలిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పెట్టుబడి రాయితీ అందించాలని సూచించారు.

అదే విధంగా దెబ్బతిన్న వరి రైతులను ఆదుకోవాలని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతుల ఆశలను అకాల వర్షాలు బాగా దెబ్బతీశాయని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts