telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏడాది పాపను ఇంటిపై నుంచి విసిరేసిన తండ్రి… ఎందుకంటే..!?

father

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ఎలిజబెత్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయి. దీంతో వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తమ ఇళ్లు ధ్వంసం చేయడానికి వీల్లేదంటూ ఆ ప్రాంత వాసులు ఎదురు తిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. వారిలో ఓ వ్యక్తి.. ఏడాది వయసున్న తన కూతుర్ని ఇంటిపైకి తీసికెళ్లి అక్కడి నుంచి ఒక్క ఉదుటున గాల్లోకి విసిరేశాడు. ఆమె గనుక నేలను తాకి ఉన్నట్లైతే అక్కడికక్కడే మరణించేదే. ఆమె అదృష్టం బాగుండి ఆందోళనకారులను అదుపు చేయడానికి వచ్చిన ఓ పోలీస్ అధికారి కంట పడిందా ఘటన. ఒక్క ఉదుటున ముందుకురికిన ఆయన.. నేల మీద పడాల్సిన పాపను గాల్లోనే అమాంతం అందుకున్నాడు. ఈ ఘటనలో అతనికి చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ పాప తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు. అయితే కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును కొట్టేసి, పాపను శారీరకంగా హింసించినట్లు మాత్రమే పేర్కొంది. ఆ తండ్రికి 5 వేల రాండ్స్(రూ.20 వేలపైగా) జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.

Related posts