జనసేన పార్టీ తన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, వారికి గుండె ధైర్యం ఇస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు అన్నారు.
వివిధ ప్రమాదాల్లో మరణించిన 220 మంది జనసైనికుల కుటుంబాలకు ఆయన నిన్న తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీమా చెక్కులను పంపిణీ చేశారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.11 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పార్టీ జెండాను భుజాలపై మోసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,400 మంది బాధిత కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు.
కార్యకర్తల సంక్షేమానికి జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.


కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ