మే 23న ఆంధ్రా శ్రీరాముడు చంద్రబాబుకి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే అధికారమని, తొడగొట్టి చెబుతున్నానని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫలితాలు రాకుండానే వైసీపీ వాళ్ళు దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు.
అలాంటి వాళ్లు వస్తే.. ఏపీ ప్రజలు బతకగలరా?… రక్షణ ఉంటుందా? అని వెంకన్న ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు భయపడే రకమైతే ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వస్తారని బుద్ధా వెంకన్న అన్నారు.