telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగు “ప్రజావేదిక” కార్యక్రమం షెడ్యూల్ విడుదల

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజావేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్  విడుదల చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలానుసారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది.

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ కార్పొరేషన్, బోర్డుల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు.

ది.27.01.2025 నుంచి ప్రజా వేదికలో పాల్గొనున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్:

కేంద్రమంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు మరియు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ శ్రీ జీవీ రెడ్డి గారు.

ది.28.01.2025 : మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత గారు మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.

ది.29.01.2025 : మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మరియు SEEDAP చైర్మన్ శ్రీ జి.దీపక్ రెడ్డి.

ది.30.01.2025 : మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు APCOGF చైర్మన్ శ్రీ గండి బాబ్జి గారు.

ది.31.01.2025 : మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మరియు APSCPC చైర్మన్ శ్రీమతి పీతల సుజాత గారు.

 

Related posts