telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నారా భువనేశ్వరి వ్యాఖ్య‌లు రోజా కౌంట‌ర్‌..

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారు. వాళ్లు వచ్చి సారీ చెబుతారని ఎదురుచూడటం లేదని, దానికోసం టైమ్‌ వేస్ట్‌ చేసుకోనని అన్నారు నారా భువనేశ్వరి. ఆ వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డామని, ఎవరైనా మహిళల్ని గౌరవించాలని కోరారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

ఈ వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మంగళవారం నాడు నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఎవ‌రైతే ఆడ‌వాళ్ల‌ని అన‌వ‌స‌రంగా అంటారో, ఏడిపిస్తారో  వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్నారు. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆడ‌వాళ్ల‌ను హేళ‌న చేసినందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు.

తండ్రి లాంటి ఎన్టీఆర్ గారిని ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచి , ఏడిపించి, ఆయ‌న మీ చెప్పులు ఏసి ఆయ‌న ఏడుస్తూ త‌న జీవితాన్ని ముగించుకున్నందు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్య‌లు, తెదేపా నేత‌లు క‌నుమ‌రుగ‌య్యార‌ని తెలిపింది. 

సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడ లేదేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడుతుంటే అది మీ భ్రమే అవుతుందని హితవు పలికారు.

చంద్ర‌బాబు హ‌యంలో ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన రోజు కనిపించని భువనేశ్వరి ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఎంత మంది మహిళలు ఎడ్చారో మీకు తెలియదా అని ప్ర‌శ్నించారు.

నీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని.. ఇకనైనా భువనేశ్వరి కేర్ ఫుల్ గా ఉండాలన్నారు నగిరి వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చ‌రించారు.

Related posts