telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ను బతికించుకొనేందుకే ఈ మీటింగ్- జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

*సీనియ‌ర్స్ మీటింగ్‌కు వెళ్ళొద్ద‌ని నాకు ఎవ‌రూ చెప్ప‌లేదు..
*ఠాగూర్‌, రేవంత్ క‌లిసి నాపై అధిష్టానికి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు..
*కాంగ్రెస్ సీనియ‌ర్ల మీటింగ్‌కు హాజ‌రైన జ‌గ్గారెడ్డి
*కాంగ్రెస్‌ను బతికించుకొనేందుకే ఈ మీటింగ్..

తనకు ఏ ఒక్కరి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశానికి హాజరు కావొద్దని చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్‌లో సమావేశం అయ్యారు.

అయితే పార్టీ సూచనలు ధిక్కరించి సమావేశం నిర్వహించవద్దని ఏఐసీసీ కార్యదర్శిఫోన్ చేశారు. ఏమైనా సమస్యలుంటే.. నేరుగా సోనియా, రాహుల్ గాంధీకి చెప్పుకోవాలే కానీ.. ఇలా విడి పడి సమావేశాలు పెట్టుకోవడం వల్ల పార్టీ నీ ఇబ్బందుల్లోకి నెట్టొద్ద‌ని, సమావేశం రద్దు చేసుకోవాలని ఆదేశించారు.అయితే, హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీనియర్ లీడర్లు సమావేశానికి హాజరయ్యారు.

Telangana Congress: హైకమాండ్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన సీనియర్లు.. G-10 గ్రూప్ సమావేశంపై కొనసాగుతున్న డైలమా..

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బతికించుకొనేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వీహెచ్ వెల్లడించారు. నేను పార్టీ మారుతున్న అని అధిష్టానం కి టాగూర్..రేవంత్ చెప్పారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీ నడుస్తుందా .? అని ఆయన ప్రశ్నించారు.

సోనియా, రాహుల్ గాంధీల కు అన్ని విషయాలు చెప్తామని, పంజాబ్‌ తరహాలో పార్టీ నష్టపోవద్దనేది మా ఉద్దేశమని వెల్లడించారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే ఎలాంటి లాభం ఉండదని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర నాయకత్వం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

బెదిరింపులు చేస్తే తాను భయపడబోనని అన్నారు. మీటింగ్ రద్దు చేసుకోవాలని అందరూ కోరుతున్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ తనతో మాట్లాడితే మీటింగ్ రద్దు చేస్తానని, లేదా సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు హోటల్ చేరుకున్న వారిలో వీహెచ్‌, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డితో పాటు శ్యామ్‌మోహన్‌రావు, కమలాకర్‌రావు కూడా ఉన్నారు. మిగతా నేతలు హాజరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

Related posts