స్పోర్ట్స్‌ను అభివృద్ధి చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యంమని తెలంగాణ క్రీడా శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో హాకీ క్రీడ అభివృద్ధిపై శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
హైదరాబాద్ సిటీలో హాకి లీగ్స్‌ను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో హాకీ క్రీడాకారులతో కమిటీలు వేస్తే హాకీ అభివృద్ధి చెందుతుందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ హాకి సోసియేషన్ను ఐదుగురు సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, సరిదిద్దాలని మంత్రి సూచించారు. హాకీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

