telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

11 ఏళ్ల తర్వాత కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు…

కర్నూలు మేయర్ కుర్చీ సొంతం చేసుకోడానికి రాజకీయపార్టీలు ఎత్తులు వేస్తున్నారు. కోర్టు కేసులు కారణంగా పదేళ్లు కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. కర్నూలు మున్సిపాలిటీని 1994లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. అయితే కర్నూలు కార్పోరేషన్ కు  2010 తరువాత ఎన్నికలు జరుగలేదు. అయితే గతేడాది ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు పోటా పోటీగా   నామినేషన్లు వేశారు. అయితే కరోనా కారణంగా అది కాస్త అర్దాంతరంగా ఆగి పోయింది. ఈ క్రమం లోనే సరిగ్గా ఏడాదికి కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలకు మోక్షం వచ్చింది. నగరపాలిక మేయర్ స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించారు. ఈ మేయర్ గిరీ కోసం వైసీపీ, టీడీపి పార్టీల్లో  పోటీ పడుతున్నారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కూడా కొన్ని డివిజన్లు అయినా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కార్పోరేషన్ పరిధిలో మొత్తం 52 డివిజన్లు ఉండగా..  614 మంది గతేడాది నామినేషన్లు వేశారు. అందులో ఒకరు మృతి చెందారు. నామినేషన్లు వేసిన వారిలో యువత, మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.  ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యూహాలు పన్నుతున్నారు.

Related posts