తిరుమలలో మంత్రుల హంగామా ఎక్కువయింది. తమ అనుచరులను ఎక్కువమందిని తిరుమలకు తీసుకు వచ్చి దర్శనాలకు పట్టుబడుతున్నారు.
ఈ నెల 15న మంత్రి ఉషాశ్రీ చరణ్ తన అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనం చేసుకున్నారు. భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఓ వీడియో జర్నలిస్టును నెట్టేశారు.
తాజాగా మంత్రి ఆర్కే రోజా 30 మంది అనుచరులతో ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కోసం పట్టుబట్టారు. అయితే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ నిరాకరించింది.
మంత్రి రోజాతోపాటు కేవలం పది మందికే ప్రొటోకాల్ దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. మిగిలిన 20 మందికి సాధారణ బ్రేక్ టికెట్లను జారీ చెయ్యడంతో టీటీడీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు గంటల పాటు శ్రీవారి ఆలయం లోనే ఉండి… తన అనుచరులకు దర్శనం చేయించారు. చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై అసహనం వ్యక్తం చేశారు.
టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక… తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం అయ్యే వరకు ఆలయంలోనే ఉన్నానని మంత్రి రోజా చెప్పారు.
కాగా..గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్, వరుస సెలవులతో శ్రీవారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు: చంద్రబాబు