telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగనన్న విద్యా దీవెన : విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు

cm Jagan tirumala

ఏపీలోని మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమచేయనుంది జగన్‌ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు ఎప్పుడు  వేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో దాదాపు 10 లక్షలమందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల వరకూ పెరుగుదల వచ్చిందన్న అధికారులు.. విద్యాదీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదనే భరోసా వచ్చిందని పేర్కొన్నారు. అందుకనే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7లక్షలకు పెరిగిందని సీఎంకు వెల్లడించారు అధికారులు.

Related posts