telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏప్రిల్ 2 న రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ

ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించిన మంత్రి డోలా బాల వీరాంజ నేయస్వామి, రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన వీరాంజ నేయస్వామి .

ఏప్రిల్ 2 న ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ అని తెలిపారు.

ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తుంది అన్నారు.

కనిగిరితో పాటు త్వరలో మార్కాపురం గిద్దలూరు లో రిలయన్స్ బయో గ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం కమీషన్ల కక్కుర్తితో ఉన్న పరిశ్రమలు తరిమేసి జగన్ యువతను ఉపాధి లేకుండా చేశారు అని మంత్రి అన్నారు.

పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు లోకేశ్ శ్రమిస్తున్నారు రాష్ట్ర యువత కోసం దావోస్లో లోకేశ్ కాలినడకన పర్యటించారు అన్నారు.

ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి డోలా బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

Related posts