యావత్ దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం నూతన పాలకవర్గం నేడు బాధ్యతలు స్వీకరించింది.ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విశేష ప్రజాదరణ కలిగిన ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ అని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు రోజురోజుకు విశ్వసనీయ పెరుగుతుందన్నారు. ఇందుఉ తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల విజయాలే గీటురాయి అన్నారు. సీఎం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌తో పాటు గాంధీ భవన్ లను అద్దెకు ఇచ్చుకునే దుస్థితి ఏర్పడిందన్నారు.

