ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్ లో సమస్య.
ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌ల్లో ఎర్రర్ – బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో పలుమార్లు రీస్టార్ట్ అవుతున్న పీసీలు, ల్యాప్‌టాప్ లు – అన్ని రకాల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలకు అంతరాయం.
అంతర్జాతీయంగా విమాన, బ్యాంకింగ్, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం.
భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సమస్య – విండోస్ లో సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీసులకు అంతరాయం.
కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఫ్రాంటీయర్ సంస్థ ప్రకటన.
కొన్ని ఆన్ లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవన్న ఆకాశ ఎయిర్ లైన్స్ – ముంబయి, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో ఆకాశ ఆన్ లైన్ సర్వీసులకు అంతరాయం.
ఆన్ లైన్ సర్వీసుల్లో అంతరాయం కలుగుతుందన్న ఇండిగో, స్పెస్ జెట్ – విండోస్ లో సమస్యపై “ఎక్స్” వేదికగా పోస్టులు పెడుతున్న యూజర్లు.
విండోస్ లో సమస్య కారణంగా హైదరాబాద్ లో నిలిచిన విమాన సర్వీసులు – బ్లూ స్క్రీన్ ఎర్రర్ పై స్పందించిన మైక్రోసాఫ్ట్ – అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ట్వీట్
నెట్ వర్క్ సమస్యపై మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నాం- సమస్యకు కారణాలను గుర్తించాం.
సమస్యను సరిదిద్దేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నాయి – సీఈఆర్ టి తగిన సాంకేతిక మార్గదర్శకాలు, సూచనలు జారీ చేస్తుంది.
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పై ఎలాంటి ప్రభావం లేదు : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ