ఉద్యమ కారులకు టీఆర్‌ఎస్ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని తెలంగాణ పౌర సరఫరా, సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావు పేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణకు మంత్రి హాజరైయ్యారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు టీఆర్‌ఎస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఏకమై వచ్చినా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపును ఆపలేకపోయారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్‌ది కాదని.. తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే ఓనర్లని అన్నారు.