కరోనాతో భయపడాల్సిందేమీ లేదని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాధితుల ఆర్యోగపరిస్థితులను మంత్రి తెలుసుకున్నారు. కరోనా బాధితుల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి సాయం అందించాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు ఓట్లప్పుడే కాదు కష్టకాలంలోనూ ప్రజల్ని పట్టించుకోవాలని అన్నారు. బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్‌కు మించి వసతులు ప్రభుత్వఆసుపత్రుల్లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమ్రంతి కేసీఆర్ దయవల్ల మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గతంలోకంటే కరోనా తీవ్రత తగ్గిందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పకుండా మాస్క్‌లు ధరించాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలీకృతమయ్యాయని అన్నారు.