telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు

*జూబ్లీహీల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు.
*ఫోటోలు చూపించి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు..
*పోలీసుల అదుపులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు
*న‌లుగురు వ్య‌క్తులు కారులో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌ని చెప్పిన‌ బాధితురాలు

జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యచారం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. బాలిక స్టేట్​మెంట్​ను మరోసారి రికార్డు చేసిన పోలీసులు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని నిందితులుగా భావించిన పోలీసులు.. మరో నిందితునిగా ఓ ఎమ్మెల్యే కుమారుడిని కూడా చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన బృందంతో సదరు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అఘాయిత్యానికి ముందే వాహనం నుంచి దిగిపోయాడని తొలుత తెలిపారు.

ఐదుగురు నిందితుల్లో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఐదో నిందితుడైన ఉమర్​ఖాన్​ పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

అఘాయిత్యానికి ఉపయోగించిన రెండు కార్ల నుంచి క్లూస్​ టీం కీలక ఆధారాలు సేకరించింది. అందులో దొరికిన వీర్యనమూనాలను ఎఫ్​ఎస్​ఎల్​కు పంపించింది. మరోమారు బాలిక స్టేట్​మెంట్​ను రికార్డు చేసిన పోలీసులు.. ఫొటోలు, సీసీకెమెరా దృశ్యాలను చూపిస్తూ కీలక సమాచారం సేకరించారు.

Related posts