మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడిగా, నిర్మాతగా అందరికీ సుపరిచితులే. అంతేకాదు జబర్దస్త్ జడ్జ్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్‌డే వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తుంది. నాగబాబు బర్త్‌డే వేడుకకి పవన్ కళ్యాణ్ కుటుంబం తప్ప మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, నిహారిక, ఉపాసన, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శ్రీజ తదితరులు నాగబాబు బర్త్‌డే వేడుకలో పాల్గొన్నారు. అందరు బ్లాక్ డ్రెస్‌లో బర్త్‌డే వేడుకకి హాజరు కావడం విశేషం. తాజాగా మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలు కొన్ని బయటకి రాగా, అవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని కొందరు నెటిజన్స్ చెబుతున్నారు. దీపావళి రోజు చిరు ఇంటికి వెళ్లి మరీ పండుగ జరుపుకున్న పవన్.. నాగబాబు బర్త్‌డే రోజు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు మెగా అభిమానులు.
Mega Family at #Nagababu birthday celebrations pic.twitter.com/8vuUdPfrQ5
— BARaju (@baraju_SuperHit) October 30, 2019

