telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఐపీఎల్ 2020 లో .. హైదరాబాద్ యువకుడు సందీప్ ..

hyderabad cricketer sandeep in ipl-2020

ఐపీఎల్‌-2020 సీజన్‌కు జరిగిన క్రికెట్‌ క్రీడాకారుల వేలం పాటలో నగరంలోని రాంనగర్‌కు చెందిన సందీప్‌ను రూ. 20 లక్షల బేస్‌ఫ్రైజ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో రాంనగర్‌లోని వైఎస్‌ఆర్‌ పార్కు సమీపంలోని సందీప్‌ నివాసం వద్ద సందడి నెలకొంది. సందీప్‌ ఐపీఎల్‌కు ఎంపిక కావడంతో తండ్రి పరమేశ్వర్‌, తల్లి ఉమారాణిలు ఆనందోత్సవాల్లో మునిగితేలారు. సందీప్‌ ఐపీఎల్‌కు ఎంపికైనట్టు తెలుసుకున్న రాంనగర్‌కు చెందిన క్రికెట్‌ అభిమానులు, క్రీడాకారులు, కాలనీవాసు లు ఆయన ఇంటికి చేరుకొని తల్లిదండ్రులను సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

2010లో 18 ఏళ్ల వయస్సులో రంజీ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసిన సందీప్‌ మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు నెలకొల్పా డు. ఇప్పటివరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు తన కేరీర్‌లో 7 సెంచరీలు, ఒక డబుల్‌సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ జట్టు కు వైస్‌కెప్టెన్‌గా కొన సాగుతున్నాడు. అంతేకాకుండా సందీప్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌ లర్‌ కూడా. విజయ్‌ హజారే 50 ఓవర్ల టోర్నీలో హైదరాబాద్‌ నుంచి 14 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటాడు. సందీప్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్నాడు.

కుమారుడ్ని క్రికెటర్‌ చేయడానికి బీడీఎల్‌ కంపెనీలో తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చా. తానూ దేశవ్యాప్త క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా పనిచేశాను. ఆ అనుభవంతోనే సందీ్‌పకు చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ కష్టానికి నేడు ఫలితం దక్కింది. మా కష్టానికి ఫలితం దక్కింది మాకు నలుగురు ఆడ పిల్లల తర్వాత ఐదో సంతానంగా సందీప్‌ జన్మించాడు. సందీ్‌పను క్రికెటర్‌గా చూడాలని నిర్ణయించి మూడో ఏడాది నుంచే అతడికి క్రికెట్లో కోచింగ్‌ ఇప్పించాం. కొంతకాలంగా హైదరాబాద్‌ రంజీ జట్టులో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కు ఎం పిక కావడంతో సంతోషంగా ఉంది. కాగా కొంతకాలంగా రంజీల్లో సందీప్‌ రాణిస్తుండడంతో గతేడాది స్పోర్ట్స్‌ కోటాలో ఆదాయపు శాఖ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందాడు.

Related posts