telugu navyamedia
సినిమా వార్తలు

మంచు మనోజ్ రెండో పెళ్ళిపై క్లార‌టీ..!

హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారనే విష‌యం ప్రస్తుతం టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. ఓ ఫారెన్‌ అమ్మాయితో మనోజ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నారంటూ కొంతమంది చెబుతుండగా, దానికి మోహన్ బాబు అంగీకరించడం లేదని..  లేదు సమీప బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాల‌ని మోహన్ బాబు భావిస్తున్నడని కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Manchu Manoj second marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా..  ఇందులో నిజమెంత..?

ఇప్పుడు దీనిపై మనోజ్ కూడా స్పందించారు. ‘పెళ్లికి నన్ను కూడా పిల‌వండి.. పెళ్లి ఎక్కడ..బుజ్జి పిల్లా? తెల్ల పిల్లా ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు. దీంతో తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయ్యింది.

2015లో ప్రణతి రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మనోజ్.. ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమా చేస్తున్నారు.

Related posts