బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. పెళ్ళి తరువాత కూడా బికినీ ధరించిన హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ వివాదంలో చిక్కుకున్నారు. 2019 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో టీమిండియా సెలక్టర్స్ టీం చేత ఆమె స్పెషల్‌గా టీ కప్పులు సర్వ్ చేయించుకున్నారంటూ భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ ఈ ఆరోపణలు చేశారు. దాంతో అనుష్క స్పందించారు. తనపై అనవసరంగా ఆ క్రికెటర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. “‘నాపై వస్తున్న తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పందించకోవడమే మంచిది అనుకున్నాను. అలాంటి వారిని పట్టించుకోకపోవమే ఉత్తమం అనుకున్నాను. 11 ఏళ్లుగా నా కెరీర్‌ను ఇలాగే నడుపుతూ వస్తున్నాను. నా మౌనంలో నిజాయతీ ఉంది. ఒక అబద్ధాన్ని పలు మార్లు చెబుతూ ఉంటే అది నిజమయ్యే అవకాశం ఉంటుందని అంటుంటారు. నా విషయంలో ఇదే జరుగుతోందేమోనని భయంగా ఉంది. నా గురించి కొందరు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. నేను మౌనంగా ఉండటం వల్ల అవి నిజమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు నా మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్ విషయంలోనూ నాపైనే నిందలు వేశారు. అప్పుడు కూడా నేను మౌనంగానే ఉన్నాను. ఇప్పుడు నా భర్త విరాట్ కోహ్లీ విషయంలో క్రికెట్ రంగానికి సంబంధించిన అర్థం పర్థంలేని నిందలన్నీ భరిస్తున్నాను. తప్పుడు వార్తల్లో నా పేరును వాడుతున్నారు. నేను క్రికెట్‌కు సంబంధించిన మీటింగ్స్‌లో తలదూరుస్తున్నానని, దాని వల్ల సెలక్షన్ ప్రాసెస్‌పై ఎఫెక్ట్ పడిందని వార్తలు వస్తున్నాయి. విరాట్‌తో కలిసి మ్యాచెస్ చూడటానికి విదేశాలకు వెళ్లినప్పుడు నాకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా నాపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న వారందరికీ ఒక్కటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రతి విషయంలోనూ ప్రొటోకాల్ ఫాలో అవుతూ వస్తున్నాను. అయినప్పటికీ ఎందుకు వచ్చిన గొడవ అని స్పందించలేదు. కానీ ఇక నేను మౌనంగా ఉంటే నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమే అవుతాయని స్పందించాల్సి వచ్చింది’ అని వెల్లడించారు. అనుష్క పోస్ట్ చూసిన ఫరూఖ్ ఆమెకు సారీ చెప్పారు. ‘నేనేదో జోక్‌గా అంటే దాన్ని కొండంత చేశారు. పాపం అనవసరంగా అనుష్కను ఈ విషయంలోకి లాగారు. ఆమె మంచి యువతి. విరాట్ బెస్ట్ కెప్టెన్. రవిశాస్త్రి బెస్ట్ కోచ్’ అని ట్వీట్ చేశారు. అనుష్క పెట్టిన పోస్ట్‌పై అనుష్కకు మద్దతుగా ఆమె మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా స్పందించారు.