telugu navyamedia
రాజకీయ

ఆటో డ్రైవర్‌ నుంచి మహా ‘సీఎం’ వరకు…షిండే ప్ర‌స్థానం..

మ‌హారాష్ర్టలో ఉద్దవ్ థాక్రే సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే  రాష్ట్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.

బాలాసాహెబ్​ స్ఫూర్తితో రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా మారి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్​లో మకాం పెట్టి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన ఆయనే.. ఏక్​నాథ్ శిందే.

Uddhav Thackeray should also come to Assam for vacation: Himanta Biswa Sarma's dig at Shiv Sena | Watch | India News – India TV

రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు.

ఏక్‌నాథ్‌ షిండే ప్ర‌స్థానం..

1964 ఫిబ్రవరి 9న సాతారా జిల్లాలోని జవాలీ తాలూకాలో ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. నిరుపేదలైన షిండే కుటుంబం పొట్టకూటి కోసం థానేకు వలస వెళ్లింది. థానేలో ఆటో డ్రైవర్‌ నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు.

శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏక్​నాథ్. 1980లలోశివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్​నగర్ బ్రాంచ్ హెడ్​గా నియమితులయ్యారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. .

ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో వైద్య శాఖ బాధ్యతలు నిర్వహించారు.

SC notice to Maha deputy speaker, others on rebel pleas, next hearing on 11 July: Live Updates | Mint

శివ‌సేనపై అసంతృప్తితో ఉన్న షిండే సి గుజరాత్​, సూరత్​లోని ఓ హోటల్​లో.. ఆ తర్వాత అసోం గువాహటిలోని హోటల్​లో మకాం పెట్టారు. దీంతో తిరుగుబాటు చేయడంతో జూన్ 21న శివసేన పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ శివసేన, స్వతంత్రులు కలిసి 50 మందికి పైగా ఎమ్మెల్యేలతో విజయవంతంగా తిరుగుబాటును నడిపించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Related posts