మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఇటీవల మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించారు.అందరూ అనుకున్నట్టుగానే డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. తన కుమారుడు ఆదిత్య థాకరేకు రెవెన్యూ శాఖను, అనిల్ దేశ్ ముఖ్ కు మరో కీలక శాఖ అయిన హోమ్ శాఖను అప్పగించారు.
సుభాష్ దేశాయ్ కి పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ శాఖలు, నవాబ్ మాలిక్ కు మైనారిటీ అభివృద్ధి శాఖను, చగన్ భుజ్ బల్ కు ఆహార, పౌర, వినియోగదారుల రక్షణ శాఖను అప్పగించారు. సాధారణ పరిపాలన, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్, న్యాయ శాఖలతో పాటు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలను ఉద్ధవ్ తనవద్దే ఉంచుకున్నారు.


చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్