telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వచ్చే నెల నుంచి దేశంలో లాక్ డౌన్-3?

Red zone corona

కరోనా కట్టడికి కొనసాగుతున్న లాక్ డౌన్-2 ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి లాక్ డౌన్-3 ప్రారంభం కానుంది. ఈసారి ఏయే రంగాలకు అనుమతి ఇవ్వాలన్న దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. నిజానికి అన్‌లాక్-3లో పాఠశాలలకు అనుమతిచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.

కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలకు అనుమతి ఇవ్వడం సరికాదన్నది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే, మెట్రో సేవలు తిరిగి ప్రారంభించేందుకు కూడా అనుమతి లభించకపోవచ్చని సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ అన్‌లాక్-3లో పాఠశాలలు, మెట్రోలకు అనుమతి లభించే అవకాశం లేదన్నారు.

దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ 68 రోజుల తర్వాత మే 31తో ముగిసింది.  ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జూన్ 1వ తేదీ నుంచి దేశంలో అన్‌లాక్-1 మొదలైంది. జులై 1 నుంచి ప్రారంభమైన అన్‌లాక్-2 ఈ నెల 31తో ముగియనుంది. ఈ రెండు విడతల్లోనూ పలు రంగాలకు సడలింపులు ఇచ్చిన కేంద్రం ఆగస్టు 1 నుంచి లాక్‌డౌన్-3ని అమలు చేసేందుకు సంసిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

Related posts