కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వదులుతుంటే… మరికొందరు అధిష్టానంపై చాలా గుర్రుగా ఉన్నారు. తాజాగా సీనియర్ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చారు. కుష్బూ ఆదివారం రాత్రి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇవాళ ఆమె బీజేపీలో చేరనున్నారు. కాగా.. కుష్బూ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్య పాలసీని సమర్థిస్తూ ఇటీవల ఆమె ట్వీట్ చేసారు.
కుష్బూ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కుష్బూ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు తాజాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు స్వయంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కుష్బూ.. ఇవాళ బీజేపీలో చేరబోతున్నారు. భారత పౌరురాలిగా ప్రధాని తీసుకున్న నిర్ణయాలు ప్రశంసించే హక్కు తనకు ఉందని కుష్బూ పేర్కొన్నారు. కుష్బూ రాజీనామాతో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షాక్ కు గురైంది.
ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు: మంత్రి అనిల్