telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జగ‌న్ అహంకారమే ఆయనను ఓడిస్తోందన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలిచే  పరిస్థితి  లేదని, కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని ఓడించినట్లే  జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక రావటం బీజేపీకి కలసి వచ్చిందన్నారు.

Related posts