ఈ పిల్లి పేరు క్సెర్డన్.. దీని వయస్సు ఆరేళ్లు. స్విట్జర్లాండ్‌లోని రూటీలో ఉంటున్న ఈ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా పేజీ కూడా ఉంది. దీనికి 22 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. శరీమంతా ముడతలతో ఉండే ఈ పిల్లిని చూస్తే మీకు కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్పకుండా గుర్తుకొస్తాయి. ఇది మిగతా పిల్లులకంటే ఎంతో భిన్నమైనది. సాధారణ పిల్లులకు ఒంటి నిండా వెంటుకలు ఉంటాయి. అయితే, క్సెర్డన్ మాత్రం వెంటుకలు లేకుండా పుట్టింది. దానితోపాటు పుట్టిన మిగతా పిల్లులు ఆరోగ్యంగా, రోమాలతో పుట్టినా.. ఇది మాత్రమే భిన్నంగా జన్మించింది. ఈ వింత పిల్లిని 47 ఏళ్ల శాండ్రా ఫ్లిప్పీ పెంచుకుంటున్నారు. ఈ పిల్లి మనకు అందహీనంగా కనిపిస్తున్నా.. శాండ్రా మాత్రం ఆ పిల్లి ప్రపంచంలోనే స్వీట్ అండ్ క్యూట్ క్యాట్ అని మురిసిపోతుంటారు.