telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చినజీయర్‌స్వామితో కేసీఆర్ భేటీ ..యాదాద్రిలో మహా సుదర్శన యాగం!

kcr chinajiyar

యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు నిర్ణయిం, మంత్రులు, వివిధ సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించనున్నారు. సీఆర్‌ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతలలోని ఆశ్రమంలో వైష్ణవ పీఠాధిపతి చినజీయర్‌స్వామిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆశ్రమ సిబ్బంది పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు రెండున్నర గంటలకుపైగా చినజీయర్‌ స్వామితో చర్చలు జరిపారు.

యాగం నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. 100 ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 3 వేల మంది రుత్విక్కులు, వారికి సహాయకులుగా మరో 3 వేల మంది యాగ నిర్వహణలో ఉంటారు.శ్రావణ మాసం ముగిసేలోగా యాదాద్రి పనులు పూర్తవుతాయని, ఆపై శుభముహూర్తం చూసి ఆలయాన్ని మహా వైభవంగా ప్రారంభిద్దామని కేసీఆర్ స్వామికి తెలిపారు. మహా సుదర్శన యాగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, భద్రీనాథ్‌, శ్రీరంగం, తిరుపతి తదితర క్షేత్రాల మఠాధిపతులను ఆహ్వానించనున్నారు.

Related posts