telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ కు సీఎస్‌కే గిఫ్ట్…

ఐపీఎల్‌ 2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటానికి ముందు చెన్నై ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే చెన్నై టీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఈ జాబితాలో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ కేట్‌ క్రాస్‌ కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు పెద్ద అభిమాని. సీఎస్‌కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్‌కు సీఎస్‌కే ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. కేట్‌కు చెన్నై ఫ్రాంఛైజీ ప్రత్యేక జెర్సీని పంపింది. సీఎస్‌కే జెర్సీని అందుకున్న కేట్‌.. దానిని ధరించి తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. అంతేకాదు చెన్నైకి కృతజ్ఞతలు తెలిపింది. 29 ఏళ్ల కేట్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు, 28 వన్డేలు, 13 టీ20లు ఆడింది. ‘మీ అభిమానానికి థ్యాంక్స్‌ సీఎస్‌కే. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్‌కే జెర్సీపై 16 నెంబర్‌ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల దృశ్యా ఐపీఎల్‌ 2021 రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్‌ ఆరంభిస్తే చూడాలని ఉంది’ అంటూ ఇంగ్లీష్ బౌలర్ కేట్‌ క్రాస్‌ క్యాప్షన్‌ జత చేసింది. దేశంలో విలయం సృష్టిస్తున్న కరోనా.. ఐపీఎల్‌ను కూడా తాకడంతో అప్రమత్తమైన బీసీసీఐ టోర్నీని అర్ధంతరంగా నిలిపివేసింది.

Related posts