telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ ఇంట్లో సీసీబీ సోదాలు… కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం

Ragini Dwivedi

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ తాజాగా గురువారం మరోసారి సీసీబీ ఎదుట హాజరుకావడంతో ఎవరి పేర్లు సూచించారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఏ విధంగా సమర్పించారనేది.. మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. మూడురోజుల క్రితం విచారణకు హాజరైన ఇంద్రజిత్ లంకేశ్ సమగ్రంగా ఆధారాలు చూపలేదని సీసీబీ అధికారులు మరో నోటీసుతో పిలిపించారు. ఇక డ్రగ్స్ కేసుతో సంబంధమున్నట్టుగా వార్తలొస్తున్న ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కూడా శుక్రవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విచారణకు హాజరయింది. ఆమె నివాసముంటున్న బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సోదాలు చేసింది. ఇందులో భాగంగా హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాహుల్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌లో వీడియోలు, ఫొటోలు చూసిన సీసీబీ అధికారులు మరింత మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే.. సంజనా అందుబాటులోకి లేకపోయారనే విషయం వివాదానికి దారి తీయగా.. మరోసారి ఆమె తీవ్రంగా స్పందించింది. తానేమీ ఉగ్రవాదిని కానని, సినీరంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నానని.. తనకు మిత్రులు ఉన్నారని చెప్పింది. రాహుల్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదని సంజనా చెప్పుకొచ్చింది. మొత్తం మీద.. శాండల్‌వుడ్‌ను డ్రగ్స్ కేసు బాగానే వణికిస్తోంది.

Related posts