telugu navyamedia
తెలంగాణ వార్తలు

కలెక్టర్ కారుకు రూ27 వేల 850 జరిమానా..

ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రజలపైనే కాకుండా ప్రభుత్వ అధికారులపై కూడా జరిమానాలు విధిస్తున్నారు.

తాజాగా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం నిబంధనల ఉల్లంఘించింది. రోడ్డు నియమావళి పాటించకపోవడంతో ట్రాఫిక్ చలానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడచిన ఐదేళ్లలో 28 సార్లు ట్రాఫిక్ నియమావళిని ఉల్లంఘించనట్లు సమాచారం.

పెండింగ్‌లో ఉన్న 28 చలాన్‌లకు మొత్తం రూ.27,580 జిల్లా కలెక్టర్ చెల్లించాలి. వాహనం ఓవర్ స్పీడ్ కారణంగా మొత్తం 24 చలాన్లు జారీ అయిన‌ట్లు పోలీస్ ట్రాఫిక్ చలానా వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

2016 నుంచి 2021 ఆగస్టు నెల మధ్యలో 28 సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసు వెబ్ సైట్లో నమోదైంది. విషయం తెలుసుకున్న కలెక్టరేట్ ఉద్యోగులు వెబ్ సైట్లో సూచించిన విధంగా 27 వేల 850 రూపాయల జరిమానాను చెల్లించారు.

 

Related posts