చెరువుల కబ్జాతో వరద ప్రభావానికి తిరుపతి విలవిల్లాడిందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు పర్యటించారు. తిరుచానూరు, తుమ్మలగుంట పరిసరాల్లో చెరువు నామరూపాల్లేకుండా చేయడంతో వరదనీటిముంపు ఏర్పడిందన్నారు. చెరువులను కబ్జాచేయడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
ఇష్టారాజ్యంగా కబ్జాచేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలవడంతో ఆ ప్రభావం తిరుపతి పట్టణవాసులపై పడిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. సువర్ణముఖి నది పారివాహక ప్రాంతాలనుంచి ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ చేయడం వరదపోటుకు కారణమనే భావన వ్యక్తమైంది. వరద భాధితులతో మాట్లాడిన చంద్రబాబు, వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఇద్దరు సీఎం లు మాట్లాడింది బ్రాండ్ల గురించే!:పంచుమర్తి అనురాధ