telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో బుధవారం ఉదయం ప్రొటెం చైర్మన్ అమిన్ ఉల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు.

కవితతో పాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి వారితో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత,దామోదర్ రెడ్డి లకు మంత్రి మండలి రూల్స్ బుక్స్,ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చమ్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Image

కవిత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘నాకు గొప్ప అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కవిత కృతజ్ఞతలు చెప్పారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కవిత ధన్యవాదాలు తెలిపారు.

కరోనా కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ అందరూ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆమె అన్నారు.

Related posts