సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపతి సుప్రీం కోర్టు సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల కిందనే కేంద్రం ఆయనను కోరింది. సుప్రీం కోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26న రిటైర్ కానున్నారు. ఎన్వీ రమణ 1957, ఆగస్టు 27న ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం కావడం గమనార్హం. 1983లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఎన్వీ రమణ… ఆ తర్వాత 2000 జూన్‌లో ఏపీ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియామకం అయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగానూ ఎన్వీ రమణ విశిష్ట సేవలు అందించారు.

