telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ అభివృద్ధి కి సహకరిస్తాం…కేంద్ర నిధులు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రేటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల .. చేతగాని తనం వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. మేయర్ మేము కాలేక పోవచ్చు మా కార్పొరేటర్ లు హైదరాబాద్ అభివృద్ధి కోసం లక్ష్మిభాయి.. శివాజీ లాగా పోరాడుతారని స్పష్టం చేశారు. కుట్రలు కుతంత్రాలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని… భాగ్యలక్ష్మి  అమ్మ వారి పేరుతోనే ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు వచ్చిందన్నారు. ఓవైసీ… రాజశేఖర్ రెడ్డి..చంద్రబాబు తో ఇప్పుడు కేసీఆర్ తోకలిసి ఉన్నారు..పాతనగరం అభివృద్ధి గురించి ఎందుకు అడగడం లేదు…పాతబస్తీ అభివృద్ధి కావద్ద అని ప్రశ్నించారు. పాతబస్తీ సంఘవిద్రోశకతులకు ఆడ్డాగా ఎందుకు మారిందో చెప్పాలని..మేం ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు. హిందువులను అవమానిస్తే ఊరుకోమని..అమ్మవారిని నమ్ముకుని ముందుకు వెళ్తామని అన్నారు. మేయర్ ఎన్నికల్లో కొనుగోళ్ళ కోసమే ఆలస్యం చేస్తున్నారని…పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని హెచ్చరించారు. పాతబస్తీ మాకు అడ్డా.. మళ్ళీ ఇక్కడికి వస్తామని… పాతబస్తీ పేదవారి తరఫున పోరాడేందుకు ఇక్కడికి వస్తామన్నారు. తెలంగాణ ఏ ఆలయం .. ఆలయ స్థలం జోలికి వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Related posts