తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు.
హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలలో యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలను చూపుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మెకానిక్ డీజిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ లాంటి వివిధ ట్రేడులలో ప్రవేశం కల్పించబోతున్నారు.
ఇక ఈ కాలేజీలో ప్రవేశం కోసం జూన్ 10 చివరి తేదీ కానుంది. శిక్షణ కొరకు వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ పెట్టాలి.
ఈ కోర్సులలో మోటార్ మెకానిక్ వెహికల్ రెండు సంవత్సరాల వ్యవధి, మెకానిక్ డీజిల్ ఏడాది శిక్షణను కలిగి ఉంటుంది.
ఈ రెండు ట్రేడ్స్ చదవాలన్నవారు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి.
పెయింటింగ్ శిక్షణకు రెండు సంవత్సరాలు, వెల్డింగ్ అయితే ఏడాదికాలం శిక్షణను కలిగి ఉంటుంది. వీటికి కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు.