telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అదొక మోడరన్ టాయిలెట్.. మూత్ర పరీక్షలు కూడా చేసేస్తుందట..

toilet that do tests also

టెక్ అందుబాటులోకి వావస్తుండటంతో రోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణ తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఔత్సహికులైన కొందరు మాత్రం సరికొత్తగా ఆలోచిస్తూ, పరిశోధనలు చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజాగా అదే తరహాలో మూత్ర పరీక్ష కోసం ప్రయోగశాలలకు వెళ్లాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండకపోవచ్చు అన్న చందాన ఓ ఆవిష్కరణ రూపొందించారు. ఎందుకంటే ఆ పరీక్షను నిర్వహించే స్మార్ట్‌ టాయిలెట్లను మోర్‌గ్రిడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా రూపొందించారు. వ్యక్తుల శరీర జీవక్రియల స్థితిగతులకు సంబంధించిన వివరాలను ఈ టాయిలెట్ల ద్వారా తెలుసుకోవచ్చట! దీనికి సంబంధించిన వివరాలను నేచర్‌ డిజిటల్‌ పత్రిక ప్రచురించింది.

పరిశోధకుడు జాషువా కూన్‌ తదితరులు… పది రోజుల్లో 110 శాంపిళ్లను పరీక్షించారు. తాము తయారుచేసిన స్మార్ట్‌ మూత్రపరీక్ష ద్వారా వారి శారీరక జీవక్రియల్లో వచ్చే మార్పులను గమనించారు. అసిటమినోఫెన్‌ మందును తీసుకున్న అనంతరం మూత్రాన్ని పరీక్షించగా… అందులో అయాన్‌ తీవ్రత పెరిగినట్టు స్పష్టంగా గుర్తించారు. వ్యాయామం, నిద్ర తదితరాల వల్ల జీవక్రియల్లో వచ్చే చిన్నపాటి మార్పులను కూడా తమ కొత్త సాంకేతికత పట్టుకుంటోందని వారు తెలిపారు. త్వరలోనే పోర్టబుల్‌ మాస్‌ స్పెక్టోమీటర్లను అనుసంధానం చేసి ‘స్మార్ట్‌ టాయిలెట్‌’ను మెరుగుపరుస్తామని తెలిపారు.

Related posts